విశాఖ బీచ్‌లో అదృశ్యమైన వివాహిత నెల్లూరులో ప్రత్యక్ష్యం... వేరే యువకుడితో కనిపించిన వైనం
- పెళ్లి రోజున భర్తతో కలిసి విశాఖ బీచ్‌కు వెళ్లిన సాయిప్రియ
- భర్త ఫోన్‌లో మాట్లాడేందుకు పక్కకు వెళ్లగా కనిపించకుండాపోయిన వైనం
- సముద్రంలో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులకు భర్త ఫిర్యాదు
- సముద్రంపై హెలికాప్టర్‌తో గాలించినా కనిపించని సాయిప్రియ ఆచూకీ
- భర్తతో విభేదాల కారణంగా కావాలనే ఉడాయించిన సాయి ప్రియ
పెళ్లి రోజున భర్తతో కలిసి విశాఖ బీచ్‌కు వెళ్లిన వివాహిత సాయిప్రియ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను ఫోన్‌లో మాట్లాడుతుండగా తన భార్య సముద్రంలో కొట్టుకుపోయిందని శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాయిప్రియ కోసం రెండు రోజులుగా పోలీసులు సముద్రాన్ని జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే. సముద్రంలో మునిగిపోయిందని భావించిన సాయి ప్రియ కోసం ఏకంగా నావికా దళానికి చెందిన హెలికాప్టర్ సముద్రం మీదుగా చక్కర్లు కొట్టి గాలించింది. అయితే ఊహించని విధంగా సాయిప్రియ మరో యువకుడితో కలిసి నెల్లూరులో ఉన్నట్లు పోలీసులు బుధవారం గుర్తించారు.
శ్రీనివాసరావు హైదరాబాద్‌లో పనిచేస్తుండగా... ఆమె మాత్రం విశాఖలోని ఎన్ఏడీ సమీపంలోని సంజీవయ్య నగర్‌లో ఉంటోంది. సోమవారం తమ పెళ్లి రోజు కావడంతో భార్యాభర్తలు ఇద్దరూ విశాఖ బీచ్‌కు వెళ్లారు. ఇక ఇంటికి వెళ్లిపోదామనుకుంటున్న సమయంలో శ్రీనివాసరావుకు ఫోన్ రాగా...అతడు పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడి తిరిగేలోపే సాయిప్రియ కనిపించలేదు. సాయిప్రియ సముద్రంలో కొట్టుకుపోయి ఉంటుందని భావించిన శ్రీనివాసరావు వెనువెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు.
ఎంతకీ సముద్రంలో సాయిప్రియ ఆచూకీ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు సాయిప్రియ ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉంటుందేమోనన్న భావనతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువకుడితో కలిసి ఆమె నెల్లూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా శ్రీనివాసరావు, సాయిప్రియల మధ్య విభేదాలు ఉన్నట్లుగా సమాచారం. దీంతోనే ఆమె వేరే యువకుడితో కలిసి నెల్లూరు వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను విశాఖ పోలీసులు బుధవారం సాయంత్రం వెల్లడించే అవకాశాలున్నట్లు సమాచారం.