రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు సిద్ధమవుతున్న టాలీవుడ్ అగ్ర హీరోలు
- కరోనా తర్వాత తీవ్ర కష్టాల్లో సినీ పరిశ్రమ
- బడ్జెట్ కంట్రోల్ పై దృష్టి సారించిన నిర్మాతలు
- తారక్, రామ్ చరణ్, బన్నీలతో చర్చలు జరిపిన దిల్ రాజు
కరోనా వచ్చిన తర్వాత సినీ పరిశ్రమ పరిస్థితి దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు షూటింగ్ లకు అంతరాయం కలిగింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కూడా ఇండస్ట్రీ ఇంకా పూర్తి స్తాయిలో గాడిలో పడలేదు. థియేటర్లకు వెళ్లడానికి ఇప్పటికీ జనాలు ఆలోచిస్తున్నారు.
మరోవైపు కరోనా వచ్చిన తర్వాత ఓటీటీల ప్రాబల్యం విపరీతంగా పెరిగిపోయింది. నాలుగు రోజులు ఆగితే సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది... థియేటర్ కు వెళ్లడం ఎందుకనే ఆలోచనలో జనాలు ఉన్నారు. వీటన్నింటి నేపథ్యంలో దర్శకనిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టాల్లో కూరుకుపోతున్నారు. హీరోలు మాత్రం వారి రెమ్యునరేషన్ తీసుకుని పూర్తిగా సేఫ్ జోన్ లో ఉంటున్నారు.
తమ వేతనాలు పెంచాలంటూ ఇటీవల సినీ కార్మికులు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. వేతనాలు పెంచడం వల్ల సినిమా ఖర్చు మరింతగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కాస్ట్ కటింగ్, బడ్జెట్ కంట్రోల్ దిశగా నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. నిర్మాత దిల్ రాజు అగ్రహీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో చర్చలు జరిపారు. బడ్జెట్ విషయాలు, కష్టాల గురించి వారికి వివరించారు. దీంతో, తమ రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు వారు అంగీకరించారట. ఇతర హీరోలు కూడా వారి రెమ్యునరేషన్ ను తగ్గించుకుంటారని చెపుతున్నారు. అగ్ర హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే ఇండస్ట్రీకి ఎంతో మేలు కలుగుతుందని భావిస్తున్నారు.