నిన్న నిప్పులు చెరిగిన థాకరే.. ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన షిండే!

  • తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు తనను కిందకు లాగేందుకు షిండే యత్నించాడంటూ నిన్న థాకరే ఫైర్
  • తన తండ్రి ఫొటోతో ఓట్లు అడుక్కోవద్దని వ్యాఖ్య
  • మాజీ సీఎం థాకరేకు జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేసిన షిండే
శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే పుట్టినరోజు నేడు. ఈరోజు ఆయన 62వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు శివసేన రెబెల్ నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 'మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, గౌరవనీయులైన శ్రీ ఉద్ధవ్ థాకరే గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని జగదాంబ అమ్మవారిని ప్రార్థిస్తున్నా' అని ట్వీట్ చేశారు. 

నిన్న ఏక్ నాథ్ షిండేపై ఉద్ధవ్ థాకరే తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. గతంలో అనారోగ్యంతో తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా తనను కిందకు లాగేందుకు షిండే యత్నించాడని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి పదవి పోయినప్పటికీ తనకు ఎలాంటి విచారం లేదని ఆయన అన్నారు. కానీ తన సొంత మనుషులే మోసం చేయడం బాధాకరమని చెప్పారు. 


More Telugu News