నా సినిమాల గురించి నేను చెప్పుకోను .. నాకు ఇష్టం ఉండదు: రవితేజ

  • జోరుగా జరుగుతున్న 'రామారావు' ప్రమోషన్స్  
  • బేసిగ్గా ఎక్కువ మాట్లాడనన్న రవితేజ 
  • తన సినిమాలపై ఎక్కువగా మాట్లాడనంటూ వ్యాఖ్య 
  • తన సినిమాలు చూడమని చెప్పడం తన వల్ల కాదంటూ వెల్లడి 
రవితేజ హీరోగా రూపొందిన 'రామారావు ఆన్ డ్యూటీ' ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " 1990 నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది .. నాకు తెలిసి అప్పటికీ ఇప్పటికీ పెద్ద మార్పులేం జరగలేదు .. అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేవంతే. 

శరత్ నాకు ఈ కథ చెప్పగానే  గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను. ఆయనపై ఆయనకి మంచి కాన్ఫిడెన్స్ ఉంది .. తాను చెప్పదలచుకున్న విషయాల పట్ల క్లారిటీ ఉంది. ఆయనలో నాకు నచ్చింది అదే. తాను ఏదైతే అనుకుంటున్నాడో దానిని భయం లేకుండా .. మొహమాటాలకు పోకుండా చెప్పేస్తాడు. 

ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా నేను చాలా తక్కువ మాట్లాడుతున్నానని అంటున్నారు. బేసిగ్గా ఎక్కువ మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. నా సినిమాలను గురించి ఎక్కువగా మాట్లాడటం .. చూడమని చెప్పడం నాకు ఇష్టం ఉండదు .. నా వల్ల కాదు. మరి ప్రొఫెషన్ అలాంటిది కదా అనుకుంటే, ఇప్పటిదాకా ఎలా నడిచిందో .. ఇకపై కూడా అలాగే నడుస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు.


More Telugu News