నిటారుగా ఉన్న కొండను సునాయాసంగా ఎక్కేస్తున్న బౌద్ధ సన్యాసి

  • నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
  • తాడు, చేతుల సాయం లేకుండానే కొండను ఎక్కేసిన సాధువు
  • యోగా, ధ్యానం, సాధనవల్లే సాధ్యమన్న కామెంట్లు
నిటారుగా ఉన్న కొండను ఎక్కాలంటే నిజంగా సాహస విన్యాసమే అవుతుంది. తాళ్ల సాయంతో సునాయాసంగా ఎక్కే వారు ఉంటారు. మరి ఏ సాయమూ లేకుండా, అది కూడా కేవలం రెండు కాళ్ల సాయంతోనే సునాయాసంగా కొండలను ఎక్కేస్తున్న బౌద్ధ సన్యాసి గురించి చెప్పుకోవాల్సిందే. బౌద్ధ సన్యాసి కొండను ఎక్కుతున్న వీడియోను తన్సు యేగెన్ అనే వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేయగా, అది మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియో పాతది కావడం గమనించాలి.

ఓ కొండను ఎక్కేందుకు ఇద్దరు మహిళలు ప్రయత్నం చేస్తుంటారు. సదరు కొండను ఎక్కేందుకు తాడు వేసుకుని ప్రయత్నం చేస్తుండగా.. ఇంతలో అక్కడకు వచ్చిన ఓ బౌద్ధ సన్యాసి ఏ తాడూ లేకుండా మెట్లు ఎక్కినంత సులువుగా కొండను ఎక్కేస్తాడు. దీన్ని అక్కడే ఉన్న పర్వాతారోహకులు ఆశ్చర్యంతో వీడియో తీశారు. మెడిటేషన్, యోగా, సాధన వల్లే సాధువు అంత సునాయాసంగా కొండను ఎక్కగలుగుతున్నట్టు ఓ యూజర్ కామెంట్ పెట్టాడు.


More Telugu News