దేశంలో రెండు రోజుల తర్వాత మళ్లీ పెరిగిన కరోనా కేసులు

  • కొత్తగా 18, 313 మందికి పాజిటివ్
  • మొన్నటితోపోలిస్తే  4 వేల కేసులు ఎక్కువ
  • 24 గంటల్లో 57 మంది మృతి
దేశంలో కరోనా వ్యాప్తి  మళ్లీ పెరిగింది. వరుసగా రెండు రోజులుగా కొత్త కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత ఒక్కసారిగా పెరిగాయి. గత 24 గంటల్లో 18,313 మంది పాజిటివ్ గా తేలారు. మొన్నటితో పోలిస్తే దాదాపు నాలుగు వేల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. 

అదే సమయంలో 24 గంటల్లో 57 మంది మృతి చెందగా.. 20,742 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,45,026కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటిదాకా 4,32,67,571 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల 5,26,167 మంది మృతి చెందారు. 

ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 3.48 శాతంగా, క్రియాశీల రేటు 0.33 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.47 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 27,37,235 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. దాంతో ఇప్పటిదాకా అందించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య  202,79,61,722కి చేరుకుంది.


More Telugu News