మహిళల నగ్న చిత్రాలతో పురుషుల మనోభావాలు దెబ్బతినవా?: వివేక్ అగ్నిహోత్రి సూటి ప్రశ్న

  • రణ్‌వీర్ సింగ్ నగ్న ఫొటోషూట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు
  • మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ముంబైలో ఎఫ్ఐఆర్
  • మరి మహిళల నగ్న చిత్రాల మాటేమిటన్న వివేక్ అగ్నిహోత్రి
  • ఈ శరీరం దేవుడి అద్భుత సృష్టన్న దర్శకుడు
బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్‌వీర్ సింగ్ నగ్నఫొటోషూట్ రేపిన దుమారం అంతాఇంతా కాదు. ఓ పబ్లికేషన్ కోసం రణ్‌వీర్ చేసిన ఈ ఫొటోషూట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల మనోభావాలను దెబ్బతీశాడంటూ నటుడిపై ముంబైలో పోలీసు కేసు కూడా నమోదైంది. ఈ విమర్శలు, ఎఫ్ఐఆర్‌పై బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీవ్రంగా స్పందించాడు. రణ్‌వీర్‌కు అండగా నిలిచాడు. 

ఇదో స్టుపిడ్ ఎఫ్ఐఆర్ అని కొట్టిపడేశాడు. ఎలాంటి కారణం లేకుండానే నమోదైన కేసుగా దీనిని అభివర్ణించాడు. మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారని, మరి మహిళల నగ్న చిత్రాల వల్ల పురుషుల మనోభావాలు దెబ్బతినవా? అని ప్రశ్నించాడు. ఇదో మూర్ఖపు వాదన అని తేల్చి చెప్పాడు. మన సంస్కృతిలోనే మానవ శరీరానికి గౌరవం ఉందని, మానవ శరీరం భగవంతుడి అద్భుత సృష్టి అని తాను చెబుతానని అగ్నిహోత్రి పేర్కొన్నాడు.


More Telugu News