చంద్ర‌బాబును మోహ‌న్ బాబు క‌లిసిన కార‌ణ‌మిదేన‌ట‌!

  • చంద్ర‌గిరి స‌మీపంలో మోహ‌న్ బాబు విద్యా సంస్థ‌
  • శ్రీ విద్యానికేత‌న్‌లో సాయిబాబా గుడిని క‌ట్టాల‌ని మోహ‌న్ బాబు నిర్ణ‌యం
  • విగ్ర‌హ ప్ర‌తిష్ఠాప‌న‌కు రావాల‌ని చంద్ర‌బాబుకు ఆహ్వానం
  • చంద్ర‌బాబు, మోహ‌న్ బాబుల భేటీపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ
ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తి రేకెత్తించిన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు, ప్ర‌ముఖ సినీ న‌టుడు మోహ‌న్ బాబుల భేటీలో రాజ‌కీయ కోణ‌మేదీ లేద‌ని తేలిపోయింది. ఈ మేర‌కు టీడీపీ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. చంద్ర‌బాబుతో మోహ‌న్ బాబు భేటీలో రాజ‌కీయ అంశాల ప్ర‌స్తావ‌న ఏమీ లేద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. హైద‌రాబాద్‌లోని చంద్ర‌బాబు నివాసంలో దాదాపుగా గంట‌కు పైగా సాగిన ఈ భేటీలో చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశం ఇదేనంటూ టీడీపీ క్లారిటీ ఇచ్చింది.

తిరుప‌తి స‌మీపంలో చంద్ర‌గిరి ప‌రిస‌రాల్లో చంద్ర‌బాబు సొంతూరు అయిన నారావారిప‌ల్లె స‌మీపంలోనే మోహ‌న్ బాబు శ్రీ విద్యానికేతన్ పేరిట ఓ విద్యా సంస్థ‌ను న‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విద్యా సంస్థ ప్రాంగ‌ణంలో కొత్త‌గా సాయిబాబా గుడిని నిర్మించాల‌ని మోహ‌న్ బాబు నిర్ణ‌యించార‌ట‌. ఈ ఆల‌యంలో సాయిబాబా విగ్ర‌హ ప్రతిష్ఠాప‌న‌కు రావాల‌ని చంద్ర‌బాబును ఆహ్వానించేందుకే మోహ‌న్ బాబు వ‌చ్చార‌ని టీడీపీ వెల్ల‌డించింది.


More Telugu News