ఎన్డీఏ ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థి జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌తో వైసీపీ ఎంపీల భేటీ... ఫొటో ఇదిగో

  • ఇప్ప‌టికే నామినేష‌న్ దాఖ‌లు చేసిన ధ‌న్‌కర్‌
  • ఆయా పార్టీల నేత‌ల‌తో స‌మావేశ‌మ‌వుతున్న జ‌గ‌దీప్‌
  • సాయిరెడ్డి నేతృత్వంలో ధ‌న్‌క‌ర్‌ను క‌లిసిన వైసీపీ ఎంపీలు
రాష్ట్రప‌తి ఎన్నిక‌లు ముగిశాయి. ఇక ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల కోలాహ‌లం మొద‌లైపోయింది. ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీఏ అభ్య‌ర్థిగా జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ధన్‌క‌ర్ నామినేష‌న్ కూడా దాఖ‌లు చేశారు. ఈ క్ర‌మంలో ఆయా పార్టీల ఎంపీల‌తో ధ‌న్‌క‌ర్ వ‌రుస‌గా స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. 

తాజాగా మంగ‌ళ‌వారం జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌తో వైసీపీ ఎంపీలు భేటీ అయ్యారు. వైసీపీ పార్ల‌మెంటరీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన రాజ్య‌స‌భ‌, లోక్ స‌భ స‌భ్యులు ధ‌న్‌క‌ర్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల్లో ధ‌న్‌క‌ర్‌ విజ‌యం సాధించాల‌ని వారంతా ఆకాంక్షించారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇచ్చిన వైసీపీ ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లోనూ ఎన్డీఏ అభ్య‌ర్థికే మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే.


More Telugu News