ముగిసిన సోనియా ఈడీ విచారణ... 6 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు
- రెండో రోజు విచారణకు హాజరైన సోనియా
- నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాను విచారించిన ఈడీ
- విచారణలో మధ్యాహ్న భోజనానికి విరామం
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం 6 గంటల పాటు విచారించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఓ దఫా విచారణకు హాజరైన సోనియా గాంధీ తాజాగా మంగళవారం మరోమారు విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం కుమారుడు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ వెంట రాగా సోనియా గాంధీ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
తమ కార్యాలయానికి వచ్చిన సోనియాను మధ్యాహ్నం దాకా విచారించిన ఈడీ అధికారులు ఆమెకు మధ్యాహ్న భోజన విరామం ఇచ్చారు. అనంతరం విచారణను కొనసాగించిన అధికారులు... నేషనల్ హెరాల్డ్ కేసులో నిధుల గోల్ మాల్‌పై ప్రశ్నలు సంధించారు. సాయంత్రం 6 గంటల దాకా విచారణ కొనసాగగా... 6 గంటల సమయంలో మంగళవారం నాటి విచారణ ముగిసినట్లు అధికారులు ప్రకటించడంతో సోనియా ఈడీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిపోయారు.