చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగస్వాములు కావద్దు: ఇతర దేశాలకు ఇండియా హెచ్చరిక

  • సీపీఈసీలో ఇతర దేశాలను చైనా, పాక్ భాగస్వాములను చేసే ప్రయత్నం చేస్తున్నాయన్న భారత్
  • ఇది అంగీకారయోగ్యం కాదన్న ఇండియా
  • ఇది భారత సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమవుతుందని హెచ్చరిక
చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టులో ఇతర దేశాలను కూడా చైనా, పాకిస్థాన్ దేశాలు భాగస్వాములను చేసే ప్రయత్నం చేస్తున్నాయని భారత్ మండిపడింది. ఇది చట్ట విరుద్ధమని, అంగీకారయోగ్యం కాదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బగ్చి అన్నారు. 

ఈ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావడమంటే... భారత దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్న విషయాన్ని ఆయా దేశాలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఈ ప్రాజెక్ట్ పీఓకే గుండా వెళ్తున్న క్రమంలో దీనిపై తొలి నుంచీ కూడా భారత్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తపరుస్తోంది. పాక్ ఆక్రమించుకున్న తమ భూభాగంలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని విమర్శిస్తోంది.


More Telugu News