బోయపాటితో రామ్ అదే మాట చెప్పాడట!

  • నిరాశపరిచిన 'ది వారియర్'
  • ఆలోచనలోపడిన రామ్ 
  • బోయపాటితో నెక్స్ట్ ప్రాజెక్ట్ 
  • స్క్రిప్ట్ పై మళ్లీ మొదలైన కసరత్తు
రామ్ తన తదుపరి సినిమాను బోయపాటితో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను ఇంతకుముందే లాక్ చేశారట. అయితే ఇప్పుడు మళ్లీ ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ అనే ఉద్దేశంతో రామ్ ఉన్నాడని అంటున్నారు. అందుకు కారణం 'ది వారియర్ ఎఫెక్ట్' అని చెబుతున్నారు.

రామ్ తాజా చిత్రంగా వచ్చిన 'ది వారియర్' ఆశించిన స్థాయి రెస్పాన్స్ ను రాబట్టలేకపోయింది. కథాకథనాలు ఆసక్తికరంగా నడవలేదనే టాక్ వచ్చింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే వైపు నుంచి సినిమా నిరాశపరిచిందని చెప్పుకున్నారు. రొటీన్ కి భిన్నంగా లేకపోవడమే సినిమాలో ప్రధానమైన లోపమనే విమర్శలు వచ్చాయి. 

దాంతో తన తరువాత సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డాడు. కథాకథనాల్లో కొత్తదనం ఉండేలా బోయపాటితో మరింత కసరత్తు చేయిస్తున్నాడని అంటున్నారు. అందునా ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు కావడం వలన, రామ్ మరింత సీరియస్ గా తీసుకున్నాడని చెబుతున్నారు. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి మరి.


More Telugu News