బాబాయ్ సినిమాతోనే నా జర్నీ మొదలైంది: కల్యాణ్ రామ్
- 'బింబిసార'గా కల్యాణ్ రామ్
- చారిత్రక నేపథ్యంలో సాగే కథ
- ప్రమోషన్స్ లో బిజీగా కల్యాణ్ రామ్
- బాబాయ్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చానంటూ వెల్లడి
కల్యాణ్ రామ్ హీరోగా ఆయన సొంత బ్యానర్లో 'బింబిసార' సినిమా రూపొందింది. చారిత్రక నేపథ్యాన్ని సైన్స్ ఫిక్షన్ టచ్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సినిమా ఇది. ఆగస్టు 5వ తేదీన థియేటర్లకు ఈ సినిమా రానుంది. ఈ నేపథ్యంలో తన జర్నీకి సంబంధించిన ఒక వీడియోను కల్యాణ్ రామ్ "అప్ క్లోజ్ విత్ ఎన్కే ఆర్' టైటిల్ తో వదిలాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "నేను అప్పుడు సెవెంత్ క్లాస్ చదువుతున్నాను. మా బాబాయి మా ఇంటికి వచ్చి, తాను చేస్తున్న 'బాల గోపాలుడు' సినిమాను గురించి నాన్నగారి దగ్గర ప్రస్తావించారు. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర ఒకటి ఉందనీ, ఆ పాత్రను నాతో చేయించాలని అనుకుంటున్నట్టుగా చెప్పారు. ఆ విషయంలో నాన్నగారిని ఒప్పించారు.
అలా 'బాల గోపాలుడు' సినిమాతో నటుడిగా నా జర్నీ మొదలైంది. 'తొలి చూపులోనే' సినిమాతో హీరోగా పరిచయమయ్యాను. 'అతనొక్కడే' సినిమాతో సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని, 'ఓం' వంటి ప్రయోగాలు చేశాను. ఆ సినిమా చాలా నిరాశపరిచింది. అయినా మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా ముందుకు వెళుతున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.