మహిళలు శరీర ప్రదర్శన చేస్తున్నప్పుడు పురుషులు చేయకూడదా?: రామ్ గోపాల్ వర్మ
- మగవారిని భిన్న ప్రమాణాలతో చూడొద్దన్న వర్మ
- స్త్రీలతో సమానంగా పురుషులకూ హక్కులు ఉంటాయని కామెంట్
- లింగ సమానత్వం కోరడం రణవీర్ ఉద్దేశం కావొచ్చని వ్యాఖ్య
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కు మద్దతు పలికారు. రణవీర్ సింగ్ ఇటీవలే ఓ మ్యాగజైన్ కోసం ఒంటిపై నూలుపోగు లేకుండా దిగంబరంగా ఫొటో షూట్ చేయించుకున్నారు. ఈ ఫొటోలను ఆయనే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీనిపై కొందరు మహిళలు ముంబై పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు. నటుడి చర్యను కొందరు సమర్థిస్తుంటే, కొందరు విమర్శిస్తున్నారు. మద్దతుదారుల్లో ఇప్పుడు వర్మ కూడా చేరిపోయారు.
మహిళలు తమ శరీరాలను ప్రదర్శించగా లేనిదీ, పురుషులు ఆ పని ఎందుకు చేయకూడదు? అంటూ ఆయన ప్రశ్నించారు. ‘‘లింగ సమానత్వానికి న్యాయం చేయాలని కోరడం అతని (రణవీర్) మార్గం కావచ్చు. మహిళలు తమ శృంగారాత్మక శరీరాలను చూపించినప్పుడు పురుషులు ఎందుకు చేయకూడదు? మగవారిని భిన్న ప్రమాణాలతో చూడడం కపటం. మహిళలతో సమానంగా మగవారికీ హక్కులు ఉన్నాయి’’ అని రామ్ గోపాల్ వర్మ ఓ మీడియా సంస్థతో అన్నారు.