హైదరాబాద్‌లో అర్ధరాత్రి కుమ్మేసిన వాన.. చెరువులను తలపించిన రోడ్లు

  • అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం
  • రోడ్లు జలమయం.. ట్రాఫిక్‌కు అంతరాయం
  • కోఠిలో కొట్టుకుపోయిన బైక్
తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌లో ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విధులు ముగించుకుని ఆ సమయంలో ఇళ్లకు వెళ్తున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ముఖ్యంగా బంజారాహిల్స్, నాంపల్లి, ఖైరతాబాద్, పాతబస్తీ, కోఠి, అబిడ్స్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ముషీరాబాద్, కాప్రా, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కోఠిలో వరద నీటిలో ఓ మోటారు బైక్ కొట్టుకుపోగా, మలక్‌పేట వంతెన దిగువన నడుము లోతులో నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. ఎల్బీనగర్ పరిధిలోని చింతల్‌కుంట జాతీయ రహదారిపైనా మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది.


More Telugu News