ఆపిల్ వాచ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక

  • ఆపిల్ వాచ్ ఓఎస్ లో లోపాలు ఉన్నాయంటున్న కేంద్రం
  • 8.7కి ముందు వెర్షన్లు వాడేవారికి ముప్పు ఉందని వెల్లడి
  • హ్యాకర్లు పంజా విసిరే అవకాశం ఉందని స్పష్టీకరణ
  • వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచన
ఆపిల్ స్మార్ట్ వాచ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆపిల్ వాచ్ లలో వినియోగించే వాచ్ ఓఎస్ (8.7కి ముందు వెర్షన్లు)లో అనేక లోపాలు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. ఈ లొసుగుల సాయంతో హ్యాకర్లు వాచ్ లోకి చొరబడి ఆర్బిట్రేటరీ కోడ్ రన్ చేయడమే కాకుండా, సెక్యూరిటీ వ్యవస్థలను బైపాస్ చేసి స్మార్ట్ వాచ్ ను తమ అధీనంలోకి తెచ్చుకోగలరని కేంద్రం వెల్లడించింది. 

వాచ్ ఓఎస్ పాత వెర్షన్లు వాడుతున్న వారు వెంటనే కొత్త వెర్షన్ కు అప్ డేట్ చేసుకోవాలని, ఆపిల్ నుంచి సెక్యూరిటీ ప్యాచెస్ కోరాలని సూచించింది. ఈ మేరకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ) వెల్లడించింది. ఆపిల్ వాచ్ 8.7కు ముందు పాత ఓఎస్ లు వాడుతున్న వారు అత్యంత తీవ్ర ముప్పు ముంగిట ఉన్నట్టేనని సీఈఆర్టీ తెలిపింది. అటు, ఆపిల్ కూడా వాచ్ ఓఎస్ 8.7ను రిస్క్ తో కూడిన వెర్షన్ గా పేర్కొంది.


More Telugu News