హీరోలు మాత్రమే హ్యాపీ... మిగతా వారంతా బాధల్లోనే: ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి ముత్యాల రమేశ్
- భారీ రెమ్యూనరేషన్లతో హీరోలు హ్యాపీ అన్న రమేశ్
- మిగిలిన అన్ని విభాగాలూ బాధలోనే ఉన్నాయని ఆవేదన
- ఓటీటీల్లో సినిమాల రిలీజ్‌పై సమావేశమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్
సినిమా వ్యాపారంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి ముత్యాల రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా రంగం టాలీవుడ్‌లో హీరోలు మాత్రమే సంతోషంగా ఉన్నారని, మిగిలిన అన్ని విభాగాలకు చెందిన వారంతా బాధల్లోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. భారీ రెమ్యూనరేషస్లతో హీరోలు సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోమవారం ఓటీటీల్లో సినిమాల రిలీజ్, టికెట్ల ధరలు తదితరాలపై చర్చించేందుకు సమావేశమైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఓటీటీల్లోకి సినిమాలు త్వరితగతిన విడుదలవుతున్న నేపథ్యంలో థియేటర్ల ఓనర్లతో పాటు సినిమా పంపిణీలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోతున్న వైనంపై టాలీవుడ్‌లో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో సినిమా విడుదలయ్యాక ఓటీటీలో ఎప్పుడు ఆయా సినిమాలను రిలీజ్ చేయాలన్న దానిపై సోమవారం నాటి ఛాంబర్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముత్యాల రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.