ఏదాది కాలంలో పెట్రోల్‌పై 78 సార్లు, డీజిల్‌పై 76 సార్లు బాదుడు: ఆప్ ఎంపీ రాఘ‌వ్

  • ఇంధ‌న ధ‌ర‌ల పెంపుపై ఆప్ ఎంపీ రాఘ‌వ్ ప్ర‌శ్న‌
  • 2021-22 ఏడాదిలో ఇంధ‌న ధ‌ర‌ల పెంపుపై కేంద్రం స‌మాధానం
  • ఇంధ‌న ధ‌ర‌ల పెంపు వల్లే అన్నింటి ధ‌ర‌లు పెరిగాయ‌న్న ఛ‌ద్ధా
ఇటీవ‌లి కాలంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప‌లుమార్లు పెంచిన సంగ‌తి తెలిసిందే. అలా ఎన్ని సార్లు ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచిన విష‌యాన్ని కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు పార్ల‌మెంటు సాక్షిగా సోమ‌వారం వెల్ల‌డించింది. పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు రాఘ‌వ్ ఛ‌ద్ధా అడిగిన ఓ ప్ర‌శ్న‌కు కేంద్రం సోమ‌వారం స‌మాధానం ఇచ్చింది.

2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో పెట్రోల్ ధ‌ర‌ల‌ను 78 సార్లు పెంచిన కేంద్రం... డీజిల్ ధ‌ర‌ల‌ను 76 సార్లు పెంచింద‌ట‌. తాను అడిగిన ఓ ప్ర‌శ్న‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఈ స‌మాధానం ఇచ్చింద‌ని రాఘ‌వ్ ఛ‌ద్ధా సోమ‌వారం వెల్ల‌డించారు. ఇలా క్ర‌మంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల కార‌ణంగానే దేశంలోని అన్ని ర‌కాల రేట్లు పెరిగిపోయాయ‌ని ఆయ‌న తెలిపారు.


More Telugu News