స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేసిన కేంద్ర మంత్రి.. పానీ పూరీ ఎందుకు ప్ర‌త్యేక‌మో చెప్పిన హ‌ర్దీప్ సింగ్ పూరీ

  • వీధుల్లో తిరిగిన హ‌ర్దీప్ సింగ్ పూరీ
  • కాకా హొటల్ రుచుల‌ను ఆస్వాదించిన కేంద్ర మంత్రి
  • కూర‌గాయల దుకాణాల వ‌ద్ద క‌నిపించిన వైనం
బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీ స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. సెల‌వు దినం ఆదివారం ఆయ‌న ఓ న‌గ‌రంలో పానీ పూరీ బండ్లు, కూర‌గాయ‌ల దుకాణాలు, కాకా హోట‌ళ్ల‌లో లోకల్ ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తూ క‌నిపించారు. స్ట్రీట్ వెండ‌ర్స్ బండ్ల వ‌ద్ద నిల‌బ‌డి ఫొటోల‌కు పోజులిచ్చారు. 

ఈ సంద‌ర్భంగా ఇండియ‌న్ స్ట్రీట్ ఫుడ్ ప్ర‌త్యేక‌త‌ను, ప్ర‌త్యేకించి పానీ పూరీల ప్ర‌త్యేక‌త‌ను గురించి వివ‌రించారు. దేశంలోని ప్ర‌తి ప్రాంతంలోనూ పానీ పూరీ క‌నిపిస్తుంద‌ని, అయితే ఏ రెండు పానీ పూరీ బండ్ల వ‌ద్ద ఒకే రక‌మైన రుచి క‌నిపించ‌ద‌ని వెల్ల‌డించారు. ఒక్కొక్క‌రు ఒక్కో రుచితో పానీ పూరీని అందిస్తున్నార‌ని, అందుకే ఏ పానీ పూరీ బండి వ‌ద్ద‌కు వెళ్లినా అదో ప్ర‌త్యేక‌మైన రుచిగానే నిలుస్తోందని తెలిపారు.


More Telugu News