లోక్‌ స‌భ నుంచి మాణిక్కం ఠాగూర్ స‌హా న‌లుగురు కాంగ్రెస్ సభ్యుల స‌స్పెన్ష‌న్‌

  • వ‌ర్షాకాల స‌మావేశాల నుంచి న‌లుగురు ‌సస్పెన్షన్ 
  • స‌భా నియ‌మావ‌ళిని ఉల్లంఘించార‌ని ఆరోప‌ణ‌
  • గాంధీ విగ్ర‌హం ముందు ఎంపీల నిర‌స‌న‌
కాంగ్రెస్ పార్టీకి చెందిన న‌లుగురు సభ్యులు నేడు లోక్ సభ నుంచి సస్పెండ్ అయ్యారు. వీరిలో తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌తో పాటు ఆ పార్టీ ఎంపీలు ర‌మ్య హ‌రిదాస్‌, జ్యోతి మ‌ణి, టీఎన్ ప్ర‌తాప‌న్‌లు ఉన్నారు. 

స‌భా నిబంధ‌నావ‌ళిని ధిక్క‌రించి స‌భ‌లో వీరు వ్య‌వ‌హరించార‌ని, అందుకే వీరిపై సస్పెన్ష‌న్ వేటు వేస్తున్న‌ట్లు లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా ప్ర‌క‌టించారు. వీరిని పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు మొత్తం సస్పెండ్ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. మరోపక్క, త‌మ‌ సస్పెన్షన్ తీరును నిర‌సిస్తూ న‌లుగురు ఎంపీలూ పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం ముందు ఆందోళనకు దిగారు.


More Telugu News