డబ్బుంటే ‘పవర్’ ఉన్నట్టు కాదు.. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు

  • మనీ అన్నది ఓ డేటాబేస్ అన్న మస్క్
  • సేవలను ఇచ్చిపుచ్చుకునే వాహకంగా అభివర్ణన 
  • డబ్బుకు సొంతంగా శక్తి ఏమీ లేదని వ్యాఖ్య
ఎలాన్ మస్క్.. ప్రపంచ కుబేరుడిగా, ఎలక్ట్రిక్ కార్లలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన టెస్లా కంపెనీ అధినేతగా ప్రపంచ ప్రజలకు పరిచయమైన వ్యక్తి. సాధారణంగా ఐశ్వర్యం ఉంటే, అన్నీ వారి కాళ్ల ముందే ఉంటాయని అంటుంటారు. కానీ, ఎలాన్ మస్క్ మాటలు వింటే అది నిజం కాదని తెలుస్తుంది. ఆర్థిక వ్యవస్థ, డబ్బు గురించి మస్క్ చేసిన ప్రసంగం వీడియో తాజాగా బయటకు వచ్చింది. నెటిజన్లలో చర్చకు దారితీసింది. 

డబ్బుకు సొంతంగా విలువ, శక్తి ఉండవనే విషయాన్ని ఆయన తన ప్రసంగంలో వివరించారు. ‘‘ప్రజలు ఆర్థిక వ్యవస్థనే డబ్బుగా అయోమయానికి గురవుతుంటారు. మనీ అన్నది వస్తువులు, సేవలను ఇచ్చి పుచ్చుకునే ఓ డేటాబేస్ అంతే. దానంతట అదే డబ్బుకి శక్తి లేదు. నిజమైన ఆర్థికం అంటే వస్తు, సేవలే’’ అన్నది మస్క్ అభిప్రాయం. ఈ వీడియోను ఇప్పటికే 20 లక్షల మందికి పైగా వీక్షించారు. డబ్బు అంటే లెక్కలేని వ్యక్తి నుంచి వచ్చే మాటలు ఇలానే ఉంటాయని కొందరు విమర్శలు చేయగా, కొందరు సమర్థిస్తున్నారు.


More Telugu News