'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్టుగా ఎన్టీఆర్?

  • 'బింబిసార'గా కల్యాణ్ రామ్ 
  • గతానికీ .. వర్తమానానికి మధ్య నడిచే కథ 
  • త్వరలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఆగస్టు 5వ తేదీన సినిమా విడుదల 
కల్యాణ్ రామ్ హీరోగా 'బింబిసార' సినిమా నిర్మితమైంది. తన సొంత బ్యానర్లో కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించాడు. మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నారు.  

ఈ వేడుకకు చీఫ్ గెస్టుగా ఎన్టీఆర్ ను ఆహ్వానించినట్టు సమాచారం. కల్యాణ్ రామ్ తో ఉన్న అనుబంధం కారణంగా ఎన్టీఆర్ ఈ వేడుకకి హాజరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. ఈ కథ బింబిసారుడి కాలంలోను .. ఈ కాలంలోను నడవనుందనే విషయం ట్రైలర్ ద్వారానే అర్థమైపోయింది.

చరిత్రలో రాజుగాను .. ప్రస్తుత కాలంలో మోడ్రన్ లుక్ తోను కల్యాణ్ రామ్ కనిపించనున్నాడు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించిన ఈ సినిమాకి, చిరంతన్ భట్ బాణీలను సమకూర్చాడు. ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రను పోషించగా, కేథరిన్ .. సంయుక్త మీనన్ కథనాయికలుగా అలరించనున్నారు.


More Telugu News