తొలి వన్డే సందర్భంగా స్లో ఓవర్ రేట్ జరిమానాకు గురైన టీమిండియా

  • పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో విండీస్ తో తొలి వన్డే
  • నిర్ణీత సమయానికి ఒక ఓవర్ తక్కువగా విసిరిన భారత్
  • తప్పిదాన్ని అంగీకరించిన టీమిండియా కెప్టెన్ ధావన్
  • జట్టు మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా
వెస్టిండీస్ తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరిగిన తొలి వన్డే సందర్భంగా టీమిండియా స్లో ఓవర్ రేట్ జరిమానాకు గురైంది. టీమిండియా మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. టీమిండియా కెప్టెన్ ధావన్ ఈ జరిమానాను అంగీకరించడంతో తదుపరి విచారణ లేకుండా ఈ అంశాన్ని ఇంతటితో ముగించారు. 

ఆ మ్యాచ్ లో నిర్ణీత సమయానికి టీమిండియా ఒక ఓవర్ తక్కువగా చేసినట్టు గుర్తించారు. ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఇది తప్పిదం. ఏ జట్టయినా నిర్ణీత సమయానికి ఎన్ని ఓవర్లు తక్కువగా బౌల్ చేస్తే, ఒక్కో ఓవర్ కి 20 శాతం ఫీజు చొప్పున జరిమానాగా విధిస్తారు.


More Telugu News