కామారెడ్డి జిల్లాలో మంకీపాక్స్ కలకలం
- యూరప్ దేశాల్లో మొదలైన మంకీపాక్స్ వ్యాప్తి
- భారత్ లోనూ మంకీపాక్స్ కేసులు
- ఇప్పటివరకు 4 పాజిటివ్ కేసులు నమోదు
- ఇటీవల కువైట్ నుంచి కామారెడ్డి జిల్లాకు వచ్చిన వ్యక్తి
- పరిశీలనలో ఉంచిన వైద్యులు
యూరప్ దేశాల్లో మొదలైన మంకీపాక్స్ కలకలం ఇప్పుడు భారత్ కు కూడా పాకింది. ఇప్పటికే దేశంలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోనూ మంకీపాక్స్ కలకలం రేగింది. ఇంద్రనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్టు అనుమానిస్తున్నారు.
ఆ వ్యక్తి ఈ నెల 6న కువైట్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు ఉండడంతో అతడిని వైద్యులు ఈ నెల 20 నుంచి అబ్జర్వేషన్ లో ఉంచారు. తాజాగా, అతడిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కు తరలించారు.