'లాల్ సింగ్ చడ్డా' తెలుగు ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా అనిపిస్తోంది: చిరంజీవి

  • అమీర్ ఖాన్, కరీనా నటించిన చిత్రం లాల్ సింగ్ చడ్డా
  • ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించిన నాగచైతన్య
  • ట్రైలర్ ను ఆవిష్కరించిన మెగాస్టార్
  • ఆగస్టు 11న లాల్ సింగ్ చడ్డా రిలీజ్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య నటించిన చిత్రం లాల్ సింగ్ చడ్డా.  తాజాగా, ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ చేసిన అనంతరం చిరంజీవి సోషల్ మీడియాలో స్పందించారు. లాల్ సింగ్ చడ్డా తెలుగు ట్రైలర్ ను విడుదల చేసినందుకు సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ మేరకు ట్రైలర్ యూట్యూబ్ లింకును కూడా పంచుకున్నారు. 

అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన లాల్ సింగ్ చడ్డా చిత్రాన్ని ఆమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే (వయాకామ్ 18 స్టూడియోస్) నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ హిట్ చిత్రం 'ఫారెస్ట్ గంప్' ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. వయాకామ్ 18 స్టూడియోస్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి తెలుగులో ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.


More Telugu News