ఎమ్మెల్యేకు తీరికలేకపోవడంతో కల్యాణలక్ష్మి చెక్కులు నేను పంచుతున్నా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి వ్యంగ్యం

  • రాజగోపాల్ రెడ్డి వర్సెస్ జగదీశ్ రెడ్డి
  • అవతలి పార్టీని పొగిడే నాయకుడు అంటూ జగదీశ్ వ్యాఖ్యలు
  • కల్యాణలక్ష్మి చెక్కులు రాజగోపాల్ రెడ్డి పంచలేదని వెల్లడి
  • అందుకే బౌన్స్ అయ్యాయన్న మంత్రి
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. 2018లో అంతర్గత పొరపాటుతో మునుగోడులో ఓడిపోయామని వెల్లడించారు. సొంత పార్టీ నాయకులను దూషించి, అవతలి పార్టీ వాళ్లను పొగిడే నాయకుడు రాజగోపాల్ రెడ్డి అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

కల్యాణలక్ష్మి చెక్కులు ఆయన పంచకపోవడంతో బౌన్స్ అయ్యాయని మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యేకి చెక్కులు పంచే తీరికలేదని, అందుకే తాను పంచుతున్నానని సెటైర్ వేశారు. 

రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు పనుల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. గత ఆరు నెలలుగా మునుగోడుకు వచ్చిందేలేదని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి పూటకొక మాట మాట్లాడుతున్నారని, ఇలాంటి ఎమ్మెల్యేతో ఏమీ జరగదని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే అడ్డుకోవడం వల్లే గట్టుప్పల్ మండలం ఆలస్యమైందని అన్నారు. తెలంగాణలో ఇటీవల ప్రకటించిన కొత్త మండలాల్లో గట్టుప్పల్ కూడా ఉండడం తెలిసిందే.


More Telugu News