దళితబంధు, కాళేశ్వరం ప్రాజెక్టుపై జయప్రకాశ్ నారాయణ సంచలన వ్యాఖ్యలు

  • ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వదు
  • ఇతర కులాల్లోని నిరుపేదల పరిస్థితి ఏమిటని ప్రశ్న
  • శ్రీలంక సంక్షోభాన్ని చూసిన తర్వాత కేంద్రంలో మార్పు వచ్చింది
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకంపై లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ విమర్శలు గుప్పించారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వదని అన్నారు. నిజాం నవాబు మాదిరి ఫ్రీగా డబ్బులు ఇవ్వడం ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకమని చెప్పారు. దళితులు కాకుండా ఇతర సామాజికవర్గాల్లో ఉన్న నిరుపేదల సంగతి ఏమిటని ప్రశ్నించారు. వారికి కూడా రూ. 10 లక్షలు ఇవ్వాలి కదా అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ సరికాదని తాను ముందే చెప్పానని చెప్పారు.

శ్రీలంక సంక్షోభాన్ని చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో మార్పు వచ్చిందని... దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా చర్యలకు ఉపక్రమిస్తోందని జేపీ చెప్పారు. రాష్ట్రాల అప్పులపై కేంద్రం దృష్టిని సారించడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని రాజ్యాంగ వ్యవస్థ అయిన ఫైనాన్స్ కమిషన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని చెప్పారు. 


More Telugu News