షింజో అబే మరణాన్ని తట్టుకోలేక లైవ్‌లో విలపించిన చైనా జర్నలిస్ట్ ఆత్మహత్యాయత్నం

  • షింజో మరణాన్ని రిపోర్ట్ చేస్తూ ఉద్వేగం
  • జాతీయవాదుల నుంచి విమర్శలు, బెదిరింపులు 
  • ఆత్మహత్య లేఖను షేర్ చేసిన ఆమె స్నేహితురాలు
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య విషయాన్ని రిపోర్ట్ చేస్తూ లైవ్‌లో కన్నీరుపెట్టుకున్న చైనా జర్నలిస్ట్ ఆత్మహత్యకు యత్నించారు. షింజో మరణంతో చైనీయులు సంబరాలు చేసుకున్న వేళ.. జర్నలిస్టు మాత్రం కన్నీరు పెట్టుకోవడంతో చైనా జాతీయవాదుల నుంచి విమర్శలు, బెదిరింపులు వచ్చాయి. 

జెంగ్ యింగ్ అనే జర్నలిస్ట్ ఈ నెల మొదట్లో అబే హత్యపై ప్రత్యక్ష ప్రసారం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఆమెపై ట్రోల్స్ మొదలయ్యాయి. యింగ్‌కు దేశభక్తి లేదని, వృత్తి నైపుణ్యం లేదని నెటిజన్లు విరుచుకుపడ్డారు. దీంతో ఆమె చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో క్షమాపణ తెలిపింది. తనకు వృత్తినైపుణ్యం లేదని, బహిరంగంగా తన వ్యక్తిగత భావాలను ప్రదర్శించినందుకు క్షమించాలని వేడుకున్నారు.

జాతీయ వాదుల నుంచి విమర్శలు, బెదిరింపులు రావడంతో మానసికంగా కుంగిపోయిన జెంగ్ ఆత్మహత్యకు యత్నించినట్టు ఆమె స్నేహితురాలు చెన్ లాన్ ద్వారా తెలిసింది. యింగ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన సూసైడ్ నోట్‌ను చెన్ షేర్ చేశారు. యింగ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆమె నిర్ధారించారు.


More Telugu News