శ్రావణ భార్గవి మెడలో తాళి లేదు, కాళ్లకు మెట్టెలు లేవు, నుదుటన బొట్టు లేదు: కరాటే కల్యాణి
- అన్నమయ్య పాటతో వీడియో రిలీజ్ చేసిన శ్రావణ భార్గవి
- వివాదాస్పదంగా మారిన వీడియో
- తన వీడియోలో అశ్లీలం లేదంటున్న గాయని
- ఇవన్నీ శ్రావణ భార్గవికి తెలియదా? అంటున్న కరాటే కల్యాణి
ఇటీవల టాలీవుడ్ గాయని శ్రావణ భార్గవి ఒకపరి కొకపరి అంటూ సాగే అన్నమయ్య గీతాన్ని ఆలపించిన వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో శ్రావణ భార్గవి కనిపించిన తీరు వివాదాస్పదమైంది. ఆ వీడియోను తొలగించాలని తిరుమల అన్నమయ్య ట్రస్ట్ సభ్యులు కూడా డిమాండ్ చేశారు. అయితే తన వీడియోలో అశ్లీలం ఎక్కడుందని శ్రావణ భార్గవి వాదిస్తోంది. తాజాగా ఈ వివాదంలోకి సినీ నటి కరాటే కల్యాణి కూడా ఎంటరైంది.
"నుదుటన బొట్టు లేదు, కాళ్లకు మెట్టెలు లేవు, మెడలో తాళి లేదు... పెళ్లయిన మహిళలకు ఇవన్నీ ఉండాలని శ్రావణ భార్గవికి తెలియదా?" అని కరాటే కల్యాణి ప్రశ్నించింది. "వాటిలో ఏ ఒక్కటీ ధరించకుండా, కాళ్లు చేతులూ ఊపుతూ అన్నమాచార్య కీర్తన పాడాను అంటే కుదురుతుందా? నీ పాటలో అశ్లీలం లేదంటున్నావు. ముందు, హిందూ ధర్మం ప్రకారం వివాహిత చిహ్నాలు ధరించు. ఆ పాటను డిలీట్ చెయ్" అంటూ కరాటే కల్యాణి డిమాండ్ చేసింది.
టాలీవుడ్ లో ఎంతో ప్రతిభావంతులైన సింగర్లుగా గుర్తింపు ఉన్న శ్రావణ భార్గవి, హేమచంద్ర పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే వారు విడాకులు తీసుకోనున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా శ్రావణ భార్గవి తన వీడియోలో మెడలో తాళి, కాళ్లకు మెట్టెలు, బొట్టు లేకుండా కనిపించడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోందని అంటున్నారు.