ఆరేళ్ల తర్వాత పేరేచర్ల మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు
- 2016లో భవానీ అనే మహిళ హత్య
- కుమార్తె డీఎన్ఏ ఆధారంగా మృతదేహం గుర్తింపు
- ఇద్దరి అరెస్ట్
- కోర్టులో ఉద్యోగాలంటూ డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణలు
- ఉద్యోగాలు రాకపోవడంతో భవానీని హత్య చేసిన నిందితులు
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో 2016లో భవానీ అనే మహిళ హత్యకు గురైంది. ఆ కేసును పోలీసులు ఆరేళ్ల తర్వాత ఛేదించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు భవానీని హత్య చేసి, మృతదేహాన్ని పేరేచర్ల వద్ద ఎన్ఎస్పీ కాలువలో పడేశారు.
కుమార్తె డీఎన్ఏ ఆధారంగా భవానీ మృతదేహాన్ని గుర్తించారు. కోర్టులో ఉద్యోగాల పేరిట భవానీ భారీగా డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. డబ్బు చెల్లించినా ఉద్యోగాలు రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం చెందిన నిందితులు భవానీని హత్యచేసినట్టు భావిస్తున్నారు.