రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నా కేంద్రం సాయం చేయడం లేదు: ఇంద్రకరణ్ రెడ్డి

  • వరదల కారణంగా రూ. 1,400 కోట్ల నష్టం వాటిల్లిందన్న మంత్రి 
  • తక్షణ సాయంగా రూ. 1,000 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని అడిగామని వెల్లడి 
  • రాష్ట్రాలను ఆదుకోవాల్సిన కేంద్రం ఆ బాధ్యతలను విస్మరిస్తోందని విమర్శ 
రాష్ట్రానికి ఎలాంటి సహాయసహకారాలు అందించడం లేదని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ కేంద్రం సాయం చేయడం లేదని విమర్శించారు. తాజా వరదల కారణంగా రూ. 1,400 కోట్ల నష్టం సంభవించిందని ప్రాథమిక అంచనా వేసి, తక్షణ సాయంగా రూ. 1,000 కోట్లు ఇవ్వాలని కోరినప్పటికీ... కేంద్రం నుంచి ఉలుకుపలుకు లేదని అన్నారు. రాష్ట్రాలను ఆదుకోవాల్సిన కేంద్రం ఆ బాధ్యతలను విస్మరిస్తోందని చెప్పారు. ఆర్థిక సాయం చేయాల్సింది పోయి... పాలు, ఉప్పు, పప్పులపై జీఎస్టీ పేరుతో సామాన్యుల నడ్డి విరుస్తోందని అన్నారు. తక్షణమే రాష్ట్రానికి వరద సాయాన్ని అందించాలని మంత్రి డిమాండ్ చేశారు.


More Telugu News