ద్రౌపది ముర్ము ప్రస్థానాన్ని వీడియోతో వివరించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
- భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ముర్ము
- ఆమె ప్రస్థానంతో వీడియోను విడుదల చేసిన రిజిజు
- సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్న వీడియో
భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ఆదివాసీ తెగకు చెందిన నేతగా అందరికీ తెలిసిందే. ఒడిశాలోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆమె దేశ అత్యున్నత పదవిని అధిష్టించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రస్థానం గురించి ఎన్నెన్నో కథనాలు వస్తున్నాయి. అయితే ఆమె ప్రస్థానాన్ని ఓ వీడియో రూపంలో హృద్యంగా వర్ణిస్తూ సాగిన వీడియో ఒకటి ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఈ వీడియోను ఈశాన్య రాష్ట్రాలకు చెందిన బీజేపీ కీలక నేత, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో రూపొందింది. ఈ వీడియోలో ముర్ము జననం దగ్గర నుంచి ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైన నాటి వరకు ఆమె జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నింటినీ తేదీలతో పాటు పొందుపరచడం విశేషం.