కన్నబాబు సగం మూసేస్తే.. కాకాని పూర్తిగా మూసేశారు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
- టీడీపీ హయాంలో తుపాను బాధితులను ఆదుకున్నామన్న సోమిరెడ్డి
- వైసీపీ ప్రభుత్వం అరకొర సాయం అందించి చేతులు దులుపుకుంటోందని విమర్శ
- ఏపీని శ్రీలంకతో పోలిస్తే బుకాయిస్తున్నారన్న సోమిరెడ్డి
తెలుగుదేశం పార్టీ హయాంలో తుపాను సమయంలో నష్టపోయిన రైతులకు అండగా నిలిచామని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. హెక్టార్ పత్తికి రూ. 15 వేలు, అరటికి రూ. 30 వేలు, చెరకుకు రూ. 15 వేల పరిహారం అందించి ఆదుకున్నామని తెలిపారు. తుపాను కారణంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు ఇచ్చామని చెప్పారు.
అయితే, వైసీపీ ప్రభుత్వం మాత్రం విపత్తుల సాయాన్ని అరకొరగా అందించి చేతులు దులుపుకుంటోందని అన్నారు. కన్నబాబు వ్యవసాయశాఖను సగం మూసేశారని... కాకాని వచ్చాక పూర్తిగా మూసేశారని విమర్శించారు. జగన్ పాలనలో పంటల పెట్టుబడి, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. తాము మూడు రాజధానుల విషయాన్ని అడిగితే వారు ఆఫ్రికాతో పోలుస్తారని... తాము ఏపీని శ్రీలంకతో పోలిస్తే బుకాయిస్తారని దుయ్యబట్టారు.