తెలంగాణలో నేడు, రేపు, ఎల్లుండి అత్యంత భారీ వర్షాలు... ఐఎండీ వెల్లడి

  • చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
  • గత కొన్నివారాలుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు
  • ఈ నెల 25 తర్వాత వర్షాలు తగ్గుముఖం
  • నేడు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, తెలంగాణలో ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. ఆ తర్వాత క్రమంగా వర్షాలు తగ్గుముఖం పడతాయని తెలిపింది. కాగా, ఇవాళ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ వివరించింది. 

తెలంగాణలో గత కొన్నివారాలుగా విస్తారంగా వర్షాలు పడుతుండడంతో జలాశయాలు, వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా, హైదరాబాద్ నగరం వరుణుడి ప్రభావంతో అతలాకుతలమైంది. నగరంలోని పలు కాలనీలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి.


More Telugu News