బీఫ్ ఎగుమతులపై ఆదాయం మాత్రం మోదీ ప్రభుత్వానికి కావాలి: ఒవైసీ
- స్థానికంగా ఉండే బీఫ్ దుకాణాలను మూసివేయిస్తున్నారన్న అసద్
- బీఫ్ ఎగుమతులపై మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదని విమర్శ
- పెద్ద మాంసం వ్యాపారులకు సాయం చేయాలనుకుంటోందని ఆరోపణ
ప్రధాని మోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సెటైర్లు వేశారు. బీఫ్ ను ఎగుమతి చేయడం ద్వారా ఆదాయాన్ని పొందాలని మోదీ ప్రభుత్వం అనుకుంటుందని... ఇదే సమయంలో స్థానికంగా ఉండే బీఫ్ దుకాణాలను మాత్రం మూసివేయిస్తుందని మండిపడ్డారు. మతపరమైన భావాలను రెచ్చగొడుతూ మాంసం దుకాణాలను మూసివేయిస్తున్న మోదీ ప్రభుత్వానికి... అదే మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేయడంపై మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదని విమర్శించారు.
బీఫ్ ను ఎగుమతి చేసి లాభాలను పొందాలని భారత ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ఈ క్రమంలోనే భారత్ నుంచి మాంసం దిగుమతులను మళ్లీ ప్రారంభించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరిందని ఎద్దేవా చేశారు. స్థానికంగా మాంసం దుకాణదారులను అడ్డుకుంటున్న ప్రభుత్వం... పెద్ద వ్యాపారులు డబ్బు సంపాదించేందుకు మాత్రం సాయం చేయాలనుకుంటోందని అసదుద్దీన్ విమర్శించారు.