మీ గుండె ఎంత గట్టిదో మీ బ్లడ్ గ్రూపు చెబుతుంది..!
- జన్యువుల ఆధారంగా రక్తంలో ఎన్నో గ్రూపులు
- పూర్వీకుల ప్రాంతం, వారు ఎదుర్కొన్న వ్యాధుల వల్లే మార్పులు
- ఏ, బీ, ఏబీ గ్రూపుల వారికి గుండె జబ్బుల రిస్క్
- ఓ గ్రూపు వారికి రక్తస్రావం రిస్క్
మీ బ్లడ్ గ్రూపు ఏంటి? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక్క సందర్భంలోనైనా ఎదురై ఉంటుంది. అత్యవసర చికిత్సలు, ప్రమాదాల సమయాల్లో, ప్రసవ సమయాల్లో రక్తం ఎక్కించాల్సి వచ్చినప్పుడు గ్రూపు గురించి వైద్యులు అడుగుతుంటారు. ఏ పాజిటివ్, ఏ నెగెటివ్, బీ పాజిటివ్, బీ నెగెటివ్, ఓ పాజిటివ్, ఓ నెగెటివ్, ఏబీ పాజిటివ్, ఏబీ నెగెటివ్ ఇలా గ్రూపులు ఉంటాయి. ఇలా బ్లడ్ గ్రూపు అన్నది వ్యక్తుల ఆరోగ్యంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని ప్రపంచ వ్యాప్తంగా పలు పరిశోధనలు గుర్తించాయి.
బ్లడ్ గ్రూపు, వాటి మధ్య వ్యత్యాసం
ఏ, బీ, ఓ అన్న పదాలు ఓబీవో జీన్ ను ప్రతిఫలిస్తాయి. ఈ జీన్ మన రక్త కణాలను భిన్నంగా తయారు చేస్తుంది. దీన్ని బట్టే వివిధ రక్త గ్రూపులు ఏర్పడ్డాయి. ఏబీ గ్రూపు అంటే ఏ, బీ యాంటీజెన్స్ ను వారి ఎర్ర రక్త కణాలు తయారు చేసేలా శరీర నిర్మాణం ఉంటుంది. బ్లడ్ గ్రూపుల్లో ఓ గ్రూపు ఎటువంటి యాంటీజెన్స్ ను ఉత్పత్తి చేయదు. అందుకే ఓ గ్రూపు వారు మిగిలిన రక్త గ్రూపుల వారికి తమ రక్తాన్ని అత్యవసరాల్లో దానంగా ఇవ్వొచ్చు. ఓ పాజిటివ్ వారు మిగిలిన అన్ని పాజిటివ్ గ్రూపుల వారికి ఇవ్వొచ్చు. ఓ నెగెటివ్ వారు అన్ని గ్రూపుల వారికి ఇవ్వొచ్చు. వీరిని యూనివర్సల్ డోనర్ గా చెబుతారు. జనాభాలో సుమారు సగం శాతం ఓ గ్రూపువారే ఉంటారు.
ఎర్ర రక్త కణాల్లో ప్రొటీన్లు ఉంటే వారిని పాజిటివ్ గ్రూపుగా, లేని వారిని నెగెటివ్ గా నిర్థారిస్తుంటారు. ఇలా రక్తంలో ఎందుకు వ్యత్యాసాలు? అన్న ప్రశ్నకు ఇదీ అన్న కచ్చితమైన నిర్ధారణ లేదు. పూర్వీకులు ఎక్కడి వారు, గతంలో వారికి వచ్చిన ఇన్ఫెక్షన్ల వంటివి రక్తంలో మార్పులకు దారితీసి ఉంటాయని భావిస్తున్నారు. హెమటాలజిస్ట్ డాక్టర్ డగ్లెస్ గుగెన్ హీమ్ ప్రకారం.. ఓ బ్లడ్ గ్రూపు వారు కలరాతో, టైప్ ఏ లేదా బీ బ్లడ్ గ్రూపు వారు రక్తంలో క్లాట్ (గడ్డ కట్టడం) సమస్యలు ఎదుర్కోవచ్చు.
గుండెకు రిస్క్
ఓ గ్రూపు వారితో పోలిస్తే ఏ, బీ, ఏబీ గ్రూపు వారికి హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. ఏ లేదా బీ గ్రూపు వారికి హార్ట్ ఎటాక్ రిస్క్ 8 శాతం ఎక్కువ. హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ 10 శాతం ఎక్కువ. రక్తంలో క్లాటింగ్ రేటులోనూ వ్యత్యాసం ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ) అంటోంది. ఏ, బీ బ్లడ్ గ్రూపు వారికి డీప్ వేన్ థ్రోంబోసిస్ వచ్చే అవకాశాలు 51 శాతం ఎక్కువని, పల్మనరీ ఎంబాలిజమ్ వచ్చే అవకాశం 47 శాతం ఎక్కువగా ఉంటుందని ఏహెచ్ఏ అధ్యయనం చెబుతోంది. టైప్ ఏ, బీ, ఏబీ బ్లడ్ గ్రూపు వారి శరీంలో వచ్చే ఇన్ ఫ్లమ్మేషన్ (రక్త నాళాల్లో వాపు) ఇందుకు కారణం కావచ్చని హెమటాలజిస్ట్ గుగెన్ హీమ్ నిర్వచనం.
ఏ, బీ గ్రూపుల్లోని వారి రక్తంలో ఉండే ప్రొటీన్ లు ధమనులు, సిరలలో అవరోధాలు, గట్టిపడేందుకు కారణం కావచ్చు. ఓ గ్రూపు వారికి రక్తం గడ్డ కట్టడాలు, గుండె జబ్బుల రిస్క్ తక్కువగా ఉంటుంది. కానీ, వీరికి హెమరేజింగ్ లేదా రక్తస్రావం రిస్క్ ఎక్కువ. ఏబీ గ్రూపు వారికి కాగ్నిటివ్ ఇంపెయిర్ మెంట్ రిస్క్ ఎక్కువ. అంటే గుర్తు పెట్టుకోలేకపోవడం, దేనిపైనా దృష్టి సారించలేకపోవడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి అశక్తులకు దారితీస్తుంది.