అమెజాన్, ఫ్లిప్ కార్ట్ బిగ్ సేల్స్.. రూ.40 వేలకే ఐఫోన్ 11

  • 24వ తేదీ వరకు అమెజాన్ ప్రైమ్ డే సేల్
  • 27 వరకు కొనసాగనున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్
  • క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులపై 10 శాతం డిస్కౌంట్
ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ప్రత్యేక విక్రయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో 23 నుంచి 27వ తేదీ వరకు ‘ప్లస్’ సభ్యులకు భారీ ఆఫర్లతో విక్రయాలను నిర్వహిస్తోంది. అటు పోటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ డే పేరుతో అమ్మకాలు చేపట్టింది. ఇందులో అమెజాన్ ప్రైమ్ డే సేల్ విక్రయాలు ఆదివారం (24వ తేదీ)తో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఈ సంస్థలు అందిస్తున్న భారీ ఆఫర్లను పరిశీలించినట్టయితే.. 

అమెజాన్ ప్రైమ్ పేరుతో ప్రత్యేక సబ్ స్క్రిప్షన్ సేవలు అందిస్తుంటుంది. వార్షికంగా రూ.1,499, నెలవారీగా అయితే రూ.179 చందా కట్టి అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఉచితంగా వీక్షించొచ్చు. అమెజాన్ పోర్టల్ పై ప్రైమ్ సభ్యుల కోసం కేటాయించే ప్రత్యేక డీల్స్ సొంతం చేసుకోవచ్చు. అలాగే, ఉచిత షిప్పింగ్ సేవలు కూడా పొందొచ్చు. 

అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ప్రైమ్ సభ్యులకే ఆఫర్లు పరిమితం. అంటే ఈ ఆఫర్లలో ఏది నచ్చినా అది ప్రైమ్ సభ్యులే పొందగలరు. స్మార్ట్ ఫోన్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, టీవీలు, గృహోపకరణాలు, గ్రోసరీ ఇలా ఎన్నో విభాగాల్లో తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. యాపిల్ ఐఫోన్ 13ను రూ.64,900కు ఆఫర్ చేస్తోంది. మామూలు రోజుల్లో దీని ధర రూ.66,900. దీనికి అదనంగా మరో రూ.12,950 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఐసీఐసీఐ, ఎస్ బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు చేస్తే 10 శాతం డిస్కౌంట్ (గరిష్ఠంగా రూ.3,000) సొంతం చేసుకోవచ్చు. 

వన్ ప్లస్ 10ప్రో 5జీ ధర రూ.71,999. కాగా ప్రైమ్ డే సేల్ లో రూ.58,990కే పొందొచ్చు. వన్ ప్లస్ 10ఆర్ ధర రూ.33,999కు దిగొచ్చింది. వాస్తవంగా అయితే దీని ధర రూ.39,999. షావోమీ 11టీ ప్రో ధర రూ.35,999 కాగా, ఈ సేల్ లో రూ.30,999కు సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ లో భాగంగా ఐఫోన్ 11 (బ్లాక్) ధర రూ.42,999. బ్యాంకు ఆఫర్ తో కలిపి రూ.39,999కు సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 12పైనా తగ్గింపులను అందిస్తోంది. రూ.51,999కు దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ లో కొనుగోళ్లకు యాక్సిస్ బ్యాంకు, సిటీ, కోటక్ బ్యాంకు, ఆర్ బీఎల్ బ్యాంకు కార్డులతో చెల్లింపులు చేస్తే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. మరిన్ని డీల్స్, ఆఫర్ల గురించి ఆయా ప్లాట్ ఫామ్ లను పరిశీలించగలరు.


More Telugu News