వైసీపీ మీడియా కో-ఆర్డినేటర్‌గా రవిచంద్రారెడ్డి నియామకం
- గూడూరుకు చెందిన రవిచంద్రారెడ్డి
- వైసీపీలో మీడియా కో- ఆర్డినేటర్ పేరిట కొత్త పదవి
- పార్టీ అధినేత ఆదేశాల మేరకే నియామకం అంటూ ప్రకటన
ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్సీపీ మరో కీలక పదవిని భర్తీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ మీడియా కో-ఆర్డినేటర్ పదవికి పార్టీ నేత కె.రవిచంద్రారెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకాన్ని చేపట్టినట్లు ఆ ప్రకటనలో వైసీపీ పేర్కొంది.
గతంలో నెల్లూరు జిల్లా, ప్రస్తుతం శ్రీ బాలాజీ తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గానికి చెందిన రవిచంద్రారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. పార్టీ తరఫున ఆయా మీడియా ఛానెళ్లు నిర్వహిస్తున్న డీబేట్లకు హాజరవుతున్న రవిచంద్రారెడ్డి పార్టీ వాణిని బలంగానే వినిపిస్తున్నారు. ఈ కారణంగానే ఆయనకు పార్టీ మీడియా కో-ఆర్డినేటర్ పదవి దక్కినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే... తనపై నమ్మకం ఉంచి జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, పార్టీ కోసం శ్రమిస్తానని రవిచంద్రారెడ్డి తెలిపారు.