శ్రీలంక ప్రపంచ రికార్డును సమం చేసిన టీమిండియా
- 2017లో శ్రీలంకకు కెప్టెన్లుగా వ్యవహరించిన ఏడుగురు ఆటగాళ్లు
- ఈ ఏడాది ఇప్పటి వరకు టీమిండియాకు నాయకత్వం వహించిన ఏడుగురు ప్లేయర్స్
- ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక కెప్టెన్లు కలిగిన దేశంగా శ్రీలంక రికార్డును సమం చేసిన భారత్
టీమిండియా నిన్న ఒక అరుదైన ఘనతను సాధించింది. ఒక క్యాలెండర్ ఇయర్ లో ఎక్కువ మంది కెప్టెన్లను కలిగిన దేశంగా శ్రీలంక పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది. 2017లో శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుకు ఏడుగురు ఆటగాళ్లు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు టీమిండియాకు కూడా ఏడుగురు ఆటగాళ్లు నాయకత్వం వహించారు. నిన్న వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేకు శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించాడు. దీంతో, ఈ ఏడాది టీమిండియాకు నాయకత్వం వహించిన ఏడో కెప్టెన్ అయ్యాడు.
ఈ ఏడాది భారత్ కెప్టెన్లుగు వ్యవహరించింది వీరే:
ఒక క్యాలెండర్ ఇయర్ లో ఎక్కువ కెప్టెన్లు ఉన్న దేశాలు:
1959లో భారత జట్టుకు ఐదుగురు ఆటగాళ్లు కెప్లెన్లుగా వ్యవహరించడం గమనార్హం. వినూ మన్కడ్, హేమూ అధికారి, దత్తా గైక్వాడ్, పంకజ్ రాయ్, గులాబ్ రాయ్ రంచన్ లు ఇండియన్ టీమ్ కు నాయకత్వం వహించారు.
ఈ ఏడాది భారత్ కెప్టెన్లుగు వ్యవహరించింది వీరే:
- విరాట్ కోహ్లీ - సౌతాఫ్రికాతో టెస్టులు
- కేఎల్ రాహుల్ - సౌతాఫ్రికాతో వన్డేలు
- రోహిత్ శర్మ - సౌతాఫ్రికా, వెస్టిండీస్ సిరీస్ లు
- రిషభ్ పంత్ - సౌతాఫ్రికాతో టీ20లు
- హార్ధిక్ పాండ్యా - ఐర్లండ్ లో టీ20లు
- జస్ప్రీత్ బుమ్రా - ఇంగ్లండ్ తో రీషెడ్యూల్ అయిన 5వ టెస్ట్
- శిఖర్ ధావన్ - వెస్టిండీస్ తో వన్డేలు
ఒక క్యాలెండర్ ఇయర్ లో ఎక్కువ కెప్టెన్లు ఉన్న దేశాలు:
- ఇండియా - 2022 - ఏడుగురు కెప్టెన్లు
- శ్రీలంక - 2017 - ఏడుగురు కెప్టెన్లు
- జింబాబ్వే - 2001 - ఆరుగురు కెప్టెన్లు
- ఇంగ్లండ్ - 2011 - ఆరుగురు కెప్టెన్లు
- ఆస్ట్రేలియా - 2021 - ఆరుగురు కెప్టెన్లు
1959లో భారత జట్టుకు ఐదుగురు ఆటగాళ్లు కెప్లెన్లుగా వ్యవహరించడం గమనార్హం. వినూ మన్కడ్, హేమూ అధికారి, దత్తా గైక్వాడ్, పంకజ్ రాయ్, గులాబ్ రాయ్ రంచన్ లు ఇండియన్ టీమ్ కు నాయకత్వం వహించారు.