దక్షిణాది సినిమాలు ఎక్కువ అవార్డులు దక్కించుకోవడం సంతోషకరం: పవన్ కల్యాణ్
- 68వ అంతర్జాతీయ అవార్డులను ప్రకటించిన కేంద్రం
- దక్షిణాది సినిమాలకు ఎక్కువ అవార్డులు రావడం శుభపరిణామమన్న పవన్
- విజేతలకు అభినందనలు తెలిపిన జనసేనాని
నేడు 68వ జాతీయ చలనచిత్ర అవార్డులు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజేతలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందించారు. ఈసారి ఎక్కువ అవార్డులు దక్షిణాది సినిమాలకు రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఇది శుభ పరిణామమని చెప్పారు.
టాలీవుడ్ నుంచి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎస్ఎస్ తమన్ (అల వైకుంఠపురం), ఉత్తమ కొరియోగ్రాఫర్ గా శ్రీమతి సంధ్యా రాజు (నాట్యం), ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా రాంబాబు (నాట్యం), ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'కలర్ ఫొటో' జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
విజేతలందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఇదే స్ఫూర్తితో వీరి నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.