టాస్ గెలిచిన విండీస్.. ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న టీమిండియా
- పంత్ స్థానంలో జట్టుతో చేరిన సంజూ శాంసన్
- కెప్టెన్‌గా వ్యవహరించనున్న గబ్బర్
- రోహిత్, కోహ్లీ, పంత్‌లకు విశ్రాంతి నిచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ జట్టు వెస్టిండిస్ పర్యటన శుక్రవారం అధికారికంగా మొదలైపోయింది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో టీమిండియా 3 వన్డేల వన్డే సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్ శుక్రవారం రాత్రి ప్రారంభమైపోయింది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు బౌలింగ్‌ను ఎంచుకుని భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ట్రినిడాడ్‌లోని పార్క్ ఓవల్ స్టేడియంలో మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్‌లో టీమిండియాకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానంలో సంజూ శాంసన్ జట్టులో చేరాడు. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా ఈ మ్యాచ్ ఆడనున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. వరుస సిరీస్‌లను గెలుస్తున్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ విన్నింగ్ టీమ్‌గానే బరిలోకి దిగుతోంది.