సాక్షి టీవీ ప్రసారాలను నిలిపేయండి!... కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు రఘురామ లేఖ!
- సాక్షి టీవీ లైసెన్స్‌ను కూడా రద్దు చేయాలన్న ఎంపీ
- ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉందని వెల్లడి
- సాక్షి మీడియాకు చైర్‌పర్సన్‌గా జగన్ భార్య భారతి కొనసాగుతున్న వైనం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలోని సాక్షి టీవీ ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కోరారు. సాక్షి టీవీ లైనెన్స్‌ను కూడా తక్షణమే రద్దు చేయాలని ఆయన ఠాకూర్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం రఘురామరాజు కేంద్ర మంత్రికి ఓ లేఖ రాశారు.
సాక్షి టీవీ లైసెస్స్ రద్దు, ప్రసారాల నిలిపివేతకు సంబంధించిన వ్యవహారంపై ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోందని ఆయన తన లేఖలో తెలిపారు. సాక్షి టీవీతో పాటు సాక్షి దినపత్రికను నడుపుతున్న సంస్థలకు జగన్ భార్య వైఎస్ భారతి చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.