ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలిపిన కేటీఆర్
- 15వ రాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరించబోతున్న ద్రౌపది ముర్ము
- యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందిన ద్రౌపది ముర్ము
- మహిళా రిజర్వేషన్ బిల్లు మీ హయాంలో ఆమోదం పొందుతుందని ఆకాంక్షిస్తున్నానన్న కేటీఆర్
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేశ 15వ రాష్ట్రపతిగా ఆమె బాధ్యతలను స్వీకరించబోతున్నారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
'భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముగారికి అభినందనలు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్ బిల్లు, అటవీ హక్కుల సవరణ బిల్లు మీ హయాంలో ఆమోదం పొందుతాయని ఆకాంక్షిస్తున్నాను' అంటూ ఆయన ట్వీట్ చేశారు.