హాంకాంగ్‌లోని నీర‌వ్ మోదీ ఆస్తుల‌ను సీజ్ చేసిన ఈడీ

  • రూ.28 వేల కోట్ల రుణాల‌ను ఎగ‌వేసిన వజ్రాల వ్యాపారి
  • 2018లో దేశం దాటి పారిపోయిన వైనం
  • ఇప్ప‌టికే నీర‌వ్ ఆస్తుల్లో కొన్నింటిని సీజ్ చేసిన ఈడీ
భార‌తీయ బ్యాంకుల‌కు వేలాది కోట్ల రుణాల‌ను ఎగ‌వేసి విదేశాల‌కు పారిపోయిన వ‌జ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) శుక్ర‌వారం మ‌రో అడుగు ముందుకేసింది. హాంగ్‌కాంగ్‌లోని నీరవ్ మోదీకి చెందిన కంపెనీల‌కు చెందిన ఆస్తుల‌ను అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా సీజ్ చేసిన ఆస్తుల్లో మొత్తం రూ.253.62 కోట్ల విలువ చేసే ప‌లు అభ‌ర‌ణాల‌తో పాటు కంపెనీ బ్యాంకు ఖాతాల్లోని న‌గ‌దు నిల్వ‌లు ఉన్నాయి. 

తాజాగా సీజ్ చేసిన ఆస్తుల‌తో క‌లిపి ఇప్ప‌టిదాకా నీర‌వ్ మోదీకి చెందిన రూ.2,650.07 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుల‌కు దాదాపుగా రూ.28 వేల కోట్ల పైచిలుకు రుణాల‌ను ఎగ‌వేసిన నీర‌వ్‌... 2018లో దేశం వ‌దిలి ప‌రారైన సంగ‌తి తెలిసిందే. తొలుత అమెరికా, ఆ త‌ర్వాత ఇంగ్లండ్ చేరిన నీరవ్‌ను ఇటీవ‌లే బ్రిట‌న్ పోలీసులు అరెస్ట్ చేశారు.


More Telugu News