జాతీయ చ‌ల‌న చిత్ర‌ అవార్డుల్లో 'సూరారై పోట్రు' హ‌వా!... 4 అవార్డుల‌ను కైవ‌సం చేసుకున్న త‌మిళ సినిమా

  • ఉత్త‌మ న‌టుడిగా సూర్య‌
  • ఉత్త‌మ న‌టిగా అప‌ర్ణ బాల‌ముర‌ళి
  • ఉత్త‌మ చిత్రంగా సూరారై పోట్రు
  • ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా జీవీ ప్ర‌కాశ్
జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల్లో త‌మిళ చిత్రం 'సూరారై పోట్రు' సినిమా హ‌వా క‌నిపించింది. దెక్క‌న్ ఎయిర్ వ్య‌వ‌స్థాప‌కుడు గోపినాథ్ జీవిత క‌థ ఆధారంగా తెలుగు ద‌ర్శ‌కురాలు సుధ కొంగ‌ర‌ రూపొందించిన ఈ చిత్రం 68వ జాతీయ ఉత్త‌మ చిత్రంగా ఎంపికైంది. ఈ సినిమాలో గోపినాథ్ పాత్ర‌లో క‌నిపించిన త‌మిళ స్టార్ హీరో సూర్య జాతీయ ఉత్త‌మ న‌టుడిగా, ఆయ‌న‌కు జోడీగా కనిపించిన అప‌ర్ణ బాల‌ముర‌ళి జాతీయ ఉత్త‌మ న‌టిగా ఎంపిక‌య్యారు. 

ఇక ఈ చిత్రానికి సంగీతం అందించిన జీవీ ప్ర‌కాశ్ జాతీయ ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక‌య్యారు. వెర‌సి నాలుగు కీల‌క కేట‌గిరీల్లో అవార్డుల‌ను కైవ‌సం చేసుకున్న ఈ చిత్రం జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల్లో స‌త్తా చాటింది. ఈ మేర‌కు 2020 ఏడాదికి సంబంధించి 68వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం ప్ర‌క‌టించింది.


More Telugu News