రూ.10 లక్షల పెట్టుబడితో ఏడాదిలో కోటి టర్నోవర్!... పులివెందులలో 'జగనన్న మహిళా మార్ట్' విజయగాథ!
- 10,200 మంది మహిళలు రూ.150 చొప్పున పొదుపు
- రూ.10 లక్షలతో పులివెందులలో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు
- మొత్తంగా మహిళలతోనే నిర్వహణ కొనసాగుతున్న వైనం
డ్వాక్రా సంఘాలు సాధిస్తున్న విజయాల్లో మరో విజయ గాథ చేరింది. కేవలం రూ.10 లక్షల పెట్టుబడితో మొదలైన ఓ మార్ట్ ఏడాది తిరిగేలోగానే ఏకంగా రూ.1 కోటి టర్నోవర్ సాధించింది. ఈ విజయగాథ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ఏర్పాటైన జగనన్న మహిళా మార్ట్ గాథ. ఈ మార్ట్ విజయ గాథను ప్రస్తావిస్తూ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఓ వీడియోను శుక్రవారం విడుదల చేసింది.
ఈ మార్ట్ పూర్తి వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా పరిధిలోని పులివెందులలో 1,270 పొదుపు సంఘాలు ఉండగా... వాటిలోని 10,200 మంది ఒక్కొక్కరు రూ.150 మేర పొదుపు చేసి రూ.10 లక్షలను సమకూర్చారు. ఈ మొత్తంతో పులివెందులలో జగనన్న మహిళా మార్ట్ పేరిట ఓ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించారు. ఇది ఏడాది తిరిగేలోగానే ఏకంగా రూ.1 కోటి టర్నోవర్‌ను సాధించింది. మొత్తం మహిళలలే నిర్వహిస్తున్న ఈ మార్ట్ కార్పొరేట్ సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగానే రాణిస్తుండటం గమనార్హం.