పబ్లిసిటీ కోసం రెండు అడుగుల నీటిలో అంత డేంజరస్ ఫీట్ అవసరమా?: విజయసాయిరెడ్డి
- సోంపల్లిలో గోదావరిలో పడిపోయిన టీడీపీ నేతలు
- ఈ ప్రమాదంపై సాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు
- ఎల్లో మీడియా కవరేజీ కోసమే కదా అంటూ ఎద్దేవా
ఉభయ గోదావరి జిల్లాలలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలనకు వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు బృందం గురువారం పడవ ప్రమాదానికి గురైన వైనంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. పబ్లిసిటీ కోసం రెండు అడుగుల నీటిలో అంత డేంజరస్ ఫీట్ అవసరమా? అంటూ సాయిరెడ్డి తన ట్వీట్‌లో ప్రశ్నించారు. అంతా ఎల్లో మీడియా లైవ్ కవరేజీ కోసమే కదా అని కూడా ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు.
ఎవరైనా కొట్టుకుపోతుంటే పరామర్శకు వెళ్లినోళ్లు వరద నీటిలోకి దూకి వారిని ఒడ్డుకు చేర్చాలి. మీరే జారి నీళ్ళలో పడితే ఎలా బాబూ? అని చంద్రబాబును సాయిరెడ్డి ప్రశ్నించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సోంపల్లి వద్ద ఓ పడవలో నుంచి మరో పడవలోకి మారుతున్న సందర్భంగా పడవ ఓ వైపునకు ఒరిగిపోగా...అందులోని టీడీపీ సీనియర్ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, పితాని సత్యనారాయణ, రామరాజు, రాధాకృష్ణ, అంగర రామ్మోహన్ తదితరులు గోదావరిలో పడిపోగా... వారిని మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన సంగతి తెలిసిందే.