బెంగళూరు నుంచి జాగ్ ఫాల్స్ కు ప్రత్యేక టూర్ ప్యాకేజీ
- ప్రకటించిన కేఎస్ఆర్టీసీ
- ప్రతి శుక్ర, శనివారాల్లో సర్వీసులు
- ఒక్కొక్కరికి చార్జీ రూ.1,900
దేశంలోని అత్యంత సుందర జలపాతాల్లో ఒకటి, సందర్శకులను కట్టిపడేసే జాగ్ ఫాల్స్ కోసం కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ప్యాకేని ప్రకటించింది. బెంగళూరు నుంచి శివమొగ్గ, సాగర్ మీదుగా జాగ్ ఫాల్స్ ప్రాంతానికి, నాన్ ఏసీ, స్లీపర్ సర్వీసు అందుబాటులో ఉంటుంది. ప్రతి శుక్ర, శనివారాల్లో ఈ ప్యాకేజీని కేఎస్ఆర్టీసీ నిర్వహించనుంది.
వరదహల్లి, వరదమూల, ఇక్కేరి, కెలాడి ప్రాంతాల సందర్శన కూడ కలిసే ఉంటుంది. ఈ నెల 23న శనివారం నుంచి తొలి టూర్ ప్రారంభం కానుంది. పెద్దలు అయితే ఒక్కరికి రాను, పోను రూ.2,300. 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.2,100గా నిర్ణయించారు. కేఎస్ఆర్టీసీ వెబ్ సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. జూన్ 28 నుంచి జాగ్ ఫాల్స్ కు సందర్శకులను అనుమతిస్తున్నారు.