హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. రెండున్నరేళ్ల తర్వాత నగరంలో టీ20 మ్యాచ్
- సెప్టెంబర్ 25న నగరంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20
- చివరగా 2019 డిసెంబర్ లో వెస్టిండీస్ తో మ్యాచ్ కు ఆతిథ్యం
- ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేసిన బీసీసీఐ
హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. రెండున్నరేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ నగరానికి ఓ అంతర్జాతీయ మ్యాచ్‌ను కేటాయించింది. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు హైదరాబాద్‌ను వేదికగా ఎంపిక చేసింది. ఈ సిరీస్‌తో పాటు దక్షిణాఫ్రికాతో టీ20, వన్డేల సిరీస్‌ల షెడ్యూల్, వేదికలను బీసీసీఐ గురువారం ఖరారు చేసింది.
సెప్టెంబర్ 25వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ఆసీస్, భారత్ మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. చివరగా 2019 డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది.
కాగా, ఆసీస్‌తో తొలి రెండు మ్యాచ్‌లకు మొహాలీ (సెప్టెంబర్ 20), నాగ్‌పూర్ (సెప్టెంబర్ 23) ఆతిథ్యమిస్తాయి. అనంతరం దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేల్లో భారత్ పోటీ పడుతుంది. సెప్టెంబర్ 28, అక్టోబర్ 1, 3వ తేదీల్లో జరిగే మూడు టీ20లను తిరువనంతపురం, గువాహటి, ఇండోర్ లలో షెడ్యూల్ చేశారు. అక్టోబర్ 6, 9, 11వ తేదీల్లో వరుసగా రాంచీ, లక్నో, ఢిల్లీలలో మూడు వన్డేలు జరుగుతాయి.