సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల విడుదల.. సత్తా చాటిన అమ్మాయిలు!

  • 12వ తరగతిలో 92.71 శాతం ఉత్తీర్ణత
  • టర్మ్ 1, టర్మ్ 2 వెయిటేజ్ మార్కుల ఆధారంగా స్కోర్ కార్డులు
  • ఏప్రిల్ 26 నుంచి జూన్ 4 వరకు జరిగిన టర్మ్ 2 పరీక్షలు  
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ స్కోర్ కార్డును cbse.gov.in, results.cbse.nic.in వెబ్ సైట్లలో రోల్ నంబర్, స్కూల్ నంబర్లను ఉపయోగించి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 12వ తరగతిలో 92.71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షల్లో అమ్మాయిలు సత్తా చాటారు. 94.54 శాతం మంది అమ్మాయిలు పాస్ కాగా... 91.25 శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు.  

టర్మ్ 1, టర్మ్ 2 వెయిటేజ్ మార్కుల ఆధారంగా ఫైనల్ మార్క్ షీట్లను సీబీఎస్ఈ తయారుచేసింది. విద్యా సంవత్సరంలో సాధించిన ఇంటర్నల్ అసెస్ మెంట్ మార్కులు, ప్రాజెక్ట్ వర్క్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్, ప్రీబోర్డ్ ఎగ్జామ్స్ మార్కులు స్కోర్ కార్డులో ఉంటాయి. ఏప్రిల్ 26 నుంచి జూన్ 4 వరకు టర్మ్ 2 పరీక్షలు జరిగాయి. టర్మ్ 1 పరీక్షలను గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించారు.


More Telugu News